రూ.600 కోసం తోటి ఉద్యోగిని కత్తితో పొడిచి చంపిన నిందితుడు
రిపోర్టర్: మహేష్
స్థలం: మహారాష్ట్ర
పూణెలోని చందన్‌నగర్‌లో కేవలం రూ.600 గొడవ కారణంగా ఓ డెలివరీ బాయ్ తన సహచరుడిని కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతుడిని రాహుల్ జవాంఝల్‌గా గుర్తించారు. నిందితుడు ఆశిష్ మగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బుల విషయంలో జరిగిన వాగ్వాదం తర్వాత నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విచారణలో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అసలు నిజం బయటపడింది.