నిరుద్యోగులకు గుడ్ న్యూస్: చీపురుపల్లిలో ఈనెల ఏడున మెగా ఉద్యోగ మేళా
రిపోర్టర్: సురేష్
స్థలం: చీపురుపల్లి
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అయిదో సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులతో పాటు నిరుద్యోగుల కోసం చీపురుపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల ఏడున ప్రత్యేకంగా మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు నోడల్ డిగ్రీ కళాశాల ప్రధానాచారిణి సీహెచ్ లలిత సోమవారం తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేదికపై ప్రముఖ కంపెనీల ద్వారా మొత్తం ఐదు వందల ముప్పై ఐదు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.