మహిళా ప్రొఫెసర్ వేధింపుల ఘటన: వీసీ అల్డాస్ జానయ్యపై యూనివర్సిటీ సిబ్బంది నిరసన
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
మహిళా ప్రొఫెసర్‌ను వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్డాస్ జానయ్యపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తోటి ప్రొఫెసర్లు, సిబ్బంది, విద్యార్థులు నిరసనకు దిగారని పలువురు తెలిపారు. ఫిర్యాదు చేసి పది రోజులు గడుస్తున్నా పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో భారీగా ర్యాలీ నిర్వహించి తమ నిరసనను గట్టిగా తెలిపారు.