సినీ ప్రస్థానంలో 18 ఏళ్లు పూర్తి చేసుకున్న నేచురల్ స్టార్ నాని

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Hyderabad

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 18 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, 'మీ ప్రేమను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోలేదు' అని భావోద్వేగ పోస్ట్ చేశారు. అష్టా చమ్మాతో మొదలైన ఆయన ప్రయాణం నేడు స్టార్ హీరోగా ఎదిగింది. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'ది ప్యారడైజ్' చిత్రంలో నటిస్తూ, సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్నారు.