డిజిటల్ వ్యవసాయంలో దేశానికే దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది
రిపోర్టర్: వెంకట్
స్థలం: Amaravati
డిజిటల్ వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే దిక్సూచిగా నిలిచింది. రాష్ట్రంలో 52.08 లక్షల మంది రైతులకు ఫార్మర్ ఐడిలు జారీ చేయగా, అగ్రీస్టాక్ లక్ష్యం 86.8 శాతానికి చేరింది. ఏపీఏఐఎంఎస్ 2.0 ద్వారా ఎరువుల అక్రమ వినియోగానికి అడ్డుకట్ట వేయడంతో పాటు 22 శాతం ఎరువులు ఆదా అయ్యాయి. అలాగే ఎల్నినో పరిస్థితుల్లోనూ పప్పుధాన్యాల సాగులో 99 శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది.