వైసీపీ హయాంలోనే సర్టిఫికెట్లు అంటూ జగన్పై దేవినేని ఉమా మండిపాటు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఎన్టీఆర్

ఏపీలో మెగా డీఎస్సీ-2025 పరీక్షలు మరియు నియామకాలను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని, ఏపీపీఎస్సీకి డీఎస్సీకి తేడా తెలియని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు - మాజీ మంత్రి, మైలవరం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ నకిలీవని ఆరోపిస్తున్న స్పోర్ట్స్ సర్టిఫికెట్లను గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జారీ చేశారని స్పష్టం చేస్తూ, తాము ఎలాంటి తప్పు చేయలేదని, కోర్టు ఆదేశిస్తే ఏ విచారణకైనా సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.