పల్లెర్లలో ఘనంగా గణపతి పూజలు అన్నప్రసాదం వితరణ చేసిన యూత్
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామం ఎస్సీ కాలనీలో గల్లీ బాయ్స్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ చేపట్టారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు పండాలని స్వామివారిని వేడుకున్నట్లు యూత్ సభ్యులు తెలిపారు.