గ్రూప్-1 మూల్యాంకనంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

గ్రూప్-1 ప్రధాన పరీక్షల మూల్యాంకనానికి సంబంధించి స్పష్టత ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. అప్పట్లో మాన్యువల్ మూల్యాంకన ప్రతిపాదనను బోర్డు ముందు ఉంచారా లేదా అనేదానిపై రికార్డులతో వివరణ ఇవ్వాలని కోరింది. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 మూల్యాంకన అక్రమాలపై దాఖలైన అప్పీళ్లపై బుధవారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వివాదంపై వాదనలు విన్న న్యాయస్థానం, తదుపరి విచారణను అక్టోబరు ఆరో తేదీకి వాయిదా వేసింది.