కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎంపీ ఈటల రాజేందర్ భేటీ

రిపోర్టర్: శివ స్థలం: Hyderabad

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారని తెలిపారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఆయనకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని తెలిపారు. పేదలు, రైతుల భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలపై అసెంబ్లీ, ప్రజాక్షేత్రంలో బీజేపీ చేపడుతున్న నిరసన కార్యక్రమాల గురించి అమిత్ షాతో చర్చించారు.