ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ పనులపై మంత్రి పొంగులేటి ఆకస్మిక తనిఖీ

రిపోర్టర్: సురేష్ స్థలం: ఖమ్మం

ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ భవన సముదాయ పనులను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పనుల నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భవనాల నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని హెచ్చరిస్తూ, లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు.