లడఖ్లో ఎనిమిదో జిల్లాగా సంకూ ఏర్పాటు: లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకటన

రిపోర్టర్: రాజేష్ స్థలం: Ladakh

లడఖ్లోని కార్గిల్ ప్రాంతాన్ని విభజించి నూతనంగా సంకూను ఎనిమిదో జిల్లాగా ఏర్పాటు చేస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రకటించారు. సంకూ ప్రాంత ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష నెరవేరిందని ఆయన తెలిపారు. ఈ కొత్త జిల్లాలో నాలుగు తహసీల్స్ ఉండనున్నాయని అధికారులు స్పష్టం చేశారు. అలాగే సంకూకు ప్రత్యేక హిల్ కౌన్సిల్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. లడఖ్ ప్రాంతంలో ఇటీవల ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటైన విషయం తెలిసిందే.