బర్తరఫ్ తర్వాత మొదటిసారిగా కార్యకర్తలతో కొండా సురేఖ భేటీ

రిపోర్టర్: శివ స్థలం: వరంగల్

కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన తర్వాత మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా మురళి వరంగల్‌లో ముఖ్య కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. భారీ వర్షం కారణంగా వేదికను మార్చగా, అనుచరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యకర్తల అభిప్రాయాల సేకరణ అనంతరం కొండా దంపతులు ఢిల్లీకి పయనం కానున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆమెను బుజ్జగించి కీలక పదవి కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.