బాపట్ల జిల్లాలో వాహనదారుల కోసం ఫేస్ వాష్ కార్యక్రమం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: బాపట్ల

బాపట్ల జిల్లాలో వాహనదారుల అలసటను నివారించేందుకు మరియు అప్రమత్తతను పెంచే లక్ష్యంతో జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పోలీసులు వినూత్నంగా ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం చేపట్టారు. రాత్రి సమయాల్లో సుదూర ప్రయాణాలు చేసే లారీలు మరియు ఇతర వాహనాల డ్రైవర్లకు నిద్రమత్తు వదలడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పోలీసు అధికారులు తెలిపారు.