నందిగ్రామ్ కాంగ్రెస్ అభ్యర్థి మలన్ ప్రధాన్ అరెస్ట్ దుమారం

రిపోర్టర్: శివ స్థలం: పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ అభ్యర్థి మలన్ ప్రధాన్ అరెస్టయ్యారు. 2007 నాటి పాత హత్య కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. మలన్ ప్రధాన్‌కు మద్దతు ఇస్తున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ అరెస్ట్ జరగడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ పరిణామంపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ సర్కార్ తీరును తప్పుబట్టారు.