రాప్తాడులో దారుణం: పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడు అరెస్ట్

రిపోర్టర్: మహేష్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్ను ధర్మవరం రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అమానుష ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారని, బాధితురాలికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేసినట్లు వెల్లడించారు.