అంగన్వాడీ పిల్లలకు పోషకాహారం అందించాలని బీజేపీ నాయకుల పిలుపు
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంగన్ మిలన్ సేవా కార్యక్రమం జరిగింది. మండల పార్టీ అధ్యక్షులు గజరాజు కాశీనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు చామకూరి చిత్రలేఖ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంగన్వాడీ పిల్లలకు పోషకాహారం అందేలా చూడాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అంగన్వాడీ, ఆశా వర్కర్లను సన్మానించారు. గుర్రం చైతన్య, పైల ప్రసన్న, మజ్జిగ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.