'నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేత': వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు నాంపల్లి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఏ1 గంగిరెడ్డి, ఏ3 ఉమాశంకర్ రెడ్డి, ఏ6 ఉదయ్ కుమార్ పిటిషన్లకు ఎలాంటి విచారణార్హత లేదని స్పష్టం చేస్తూ వాటిని కొట్టివేసింది. దీంతో నిందితులకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.