కోటి గాజులతో కొలువుదీరనున్న 117 అడుగుల మహా గణపతి

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

గాజువాకలోని శ్రీనగర్ డీమార్ట్ సమీపంలో వినాయక చవితి సందర్భంగా రాష్ట్రంలోనే అతిపెద్దదైన 117 అడుగుల దివ్య కంకణాలంకార మహా గణపతి భక్తులకు దర్శనమివ్వనున్నారు. కోటి గాజులతో స్వామిని ప్రత్యేకంగా అలంకరించనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గణేశ్ తెలిపారు. పండుగ రోజున పూర్తి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మహా గణపతిని దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు పొందాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు.