మల్లారెడ్డి వర్సిటీ ఖాతాలో రూ.400 కోట్లు: సీఎం రేవంత్ రెడ్డి
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
తెలంగాణ శాసనసభ వేదికగా మాజీ మంత్రి మల్లారెడ్డిని లక్ష్యంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రైవేట్ యూనివర్సిటీ అకౌంట్‌లో అకస్మాత్తుగా రూ. 400 కోట్లు ప్రత్యక్షమయ్యాయని తెలిపారు. పాలు అమ్మినా, పూలు అమ్మినా వందల కోట్లు వస్తాయా అని ఎద్దేవా చేశారు. ఆ నిధుల లభ్యతపై సమగ్ర విచారణ జరపాలనే దిశగా అసెంబ్లీలో ప్రభుత్వం బలంగా వాదించింది.