నైన్త్ బెటాలియన్ దీక్షిత్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ
రిపోర్టర్: రమేష్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పరిధిలోని వల్లివేడు వద్ద నైన్త్ బెటాలియన్ నిర్వహించిన దీక్షిత్ పరేడ్ కార్యక్రమంలో మున్సిపల్ మంత్రి పొంగుూరు నారాయణతో కలిసి స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, పరేడ్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, అధికారులు హాజరై పోలీసు సిబ్బందిని అభినందించారని కురుగొండ్ల రామ కృష్ణ వెల్లడించారు.