నెల్లూరు జిల్లాలో నిలిచిపోయిన జడ్పీ అభివృద్ధి పనులు
రిపోర్టర్: రమేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో జడ్పీ అధికారుల ఆధ్వర్యంలో ప్రారంభించాల్సిన సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు ముందుకు సాగక రద్దయ్యాయి. స్థలం లేకపోవడం మరియు గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో సుమారు 50 పనులను రద్దు చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల పనులు నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.