మొదటి ప్రయత్నంలోనే సీఏ, సీఎంఏ సాధించిన స్వర్ణకారుడి కూతురు

రిపోర్టర్: కిరణ్ స్థలం: గుంటూరు

గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్వర్ణకారుడి కుమార్తె హేమవర్షిణి మొదటి ప్రయత్నంలోనే అత్యంత కఠినమైన సీఏ, సీఎంఏ ఫైనల్‌ పరీక్షల్లో ఘన విజయం సాధించింది. తండ్రి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో రోజుకు 15 గంటలు కష్టపడి చదివి ఈ అరుదైన ఘనత సాధించింది. సాధారణ కుటుంబం నుంచి వచ్చి దేశంలోనే అత్యున్నత కోర్సులో విజేతగా నిలిచి అందరికీ స్ఫూర్తిగా నిలిచింది.