వంద సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న యూపీఎస్సీ సంస్థ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: New Delhi
దేశంలో సివిల్ సర్వీసెస్ నియామకాలను పారదర్శకంగా నిర్వహిస్తున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చే అక్టోబర్ ఒకటో తేదీ నాటికి వందేళ్లు పూర్తి చేసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. బ్రిటీష్ కాలంలో ప్రారంభమైన ఐసీఎస్ పరీక్షల నుంచి నేటి ఆధునిక యూపీఎస్సీ పరీక్షల వరకు జరిగిన చారిత్రక పరిణామాలు, సంస్కరణలను కమిషన్ వర్గాలు గుర్తు చేశాయి. స్వతంత్ర భారతదేశంలో పౌర సేవల పరీక్షల నిర్వహణలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని విశ్లేషకులు వెల్లడించారు.