డేవిడ్ రెడ్డి సినిమాలో రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'డేవిడ్ రెడ్డి'. ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్ర అయిన 'కమల రెడ్డి' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. యుద్ధరంగానికి భయపడదు.. యుద్ధరంగమే ఆమెను చూసి భయపడుతుంది అనే శక్తివంతమైన ట్యాగ్‌లైన్‌తో రమ్యకృష్ణ గంభీరమైన లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.