లక్నోలో అఖిలేష్ యాదవ్‌తో సీజేపీ ప్రతినిధి అశుతోష్ రాంకా భేటీ

రిపోర్టర్: మహేష్ స్థలం: లక్నో

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో సీజేపీ ప్రతినిధి అశుతోష్ రాంకా రహస్యంగా సమావేశమయ్యారు. దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో నిరుద్యోగం, విద్యా వ్యవస్థ, విద్యార్థుల సమస్యలపై చర్చించినట్లు సమాచారం. బీజేపీ ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా విద్యార్థి ఉద్యమాలకు మద్దతు ఇస్తున్న అఖిలేష్, ఈ భేటీతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించారు.