ప్రభుత్వ బడి విద్యార్థినులు అదృశ్యం, సినిమాకు వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్న ఉపాధ్యాయులు
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
మెహిదీపట్నం ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు అదృశ్యమవడం కలకలం రేపింది. బ్రేక్ సమయంలో బయటకు వెళ్లిన విద్యార్థినులు ఐమ్యాక్స్ థియేటర్‌కు సినిమాకు వెళ్లినట్లు తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ భద్రతా లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వాచ్‌మెన్‌ను నియమించాలని అధికారులను హెచ్చరించారు.