కృష్ణా జలాల వినియోగంపై అసత్య ప్రచారాలను తిప్పికొట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
రిపోర్టర్: కిరణ్
స్థలం: సూర్యాపేట
సచివాలయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రకటనలపై వాస్తవాలను నిలబెట్టేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నాటికి సాగునీరు మరియు విద్యుత్ అవసరాల కోసం కృష్ణా నదీ జలాల వినియోగం ఏ విధంగా జరిగిందనే అంశంపై పూర్తి వివరాలను ఆయన వెల్లడించారు. నదీ జలాల పంపిణీ విషయంలో రాజకీయ లబ్ధికోసం కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.