వరంగల్ జిల్లాలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలపై విజిలెన్స్ తనిఖీలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వరంగల్
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బిట్స్, సుమతి రెడ్డి, ఎస్వీఎస్ తదితర కాలేజీల్లో అడ్మిషన్లు, స్కాలర్షిప్స్, ఫ్యాకల్టీ మరియు సిబ్బంది వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ల్యాబ్స్, మౌలిక వసతులు, విద్యార్థుల హాజరు రికార్డులను తనిఖీ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల వివరాలపై ఆరా తీసి ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక సమర్పిస్తామని అధికారులు తెలిపారు.