నేలమట్టమైన అరటి తోటలను పరిశీలించి రైతులకు కిమిడి కళా వెంకట్రావు భరోసా

రిపోర్టర్: సతీష్ స్థలం: విజయనగరం

తీవ్రవాయుగుండం, ఈదురుగాలుల ధాటికి దెబ్బతిన్న అరటి తోటలను చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు శుక్రవారం పరిశీలించారు. పత్తికాయవలస గ్రామంలో చేతికొచ్చిన పంట నష్టపోయిన బాధిత రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. అన్నదాతలు ఎవరూ అధైర్యపడవద్దని, కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా చూస్తామని, వెంటనే సర్వే నిర్వహించి నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.