భాగ్యలక్ష్మి ఆలయంలో దీపావళి వేడుకలు: భక్తులకు ఉచితంగా వెండి నాణేల పంపిణీ

రిపోర్టర్: కృష్ణ స్థలం: Hyderabad

హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో దీపావళి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ధనత్రయోదశితో ప్రారంభమైన ఈ వేడుకలు ఆరు రోజుల పాటు కొనసాగుతాయని వెల్లడించారు. ఈనెల ఎనిమిదో తేదీ నుంచి భక్తులకు అమ్మవారి ప్రసాదంగా ఉచితంగా వెండి నాణేలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని పోలీసులు స్పష్టం చేశారు.