కార్నెల్ యూనివర్సిటీలో కలకలం: లైంగిక దాడి ఆరోపణలపై వీసీపై చెలరేగిన విమర్శలు
రిపోర్టర్: మహేష్
స్థలం: New York
కార్నెల్ యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆలస్యంగా ఫిర్యాదు చేయడంపై వర్సిటీ అధ్యక్షుడు మైఖేల్ కోట్లికాఫ్ ప్రశ్నించడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని బాధితురాలు ఆరోపించినట్లు న్యాయవాది తెలిపారు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్న ఫ్యాకల్టీ సభ్యులు త్వరలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం వెల్లడైంది.