'బ్యాంక్ అకౌంట్ అమ్మితే నేరస్తులే': Eluru Police హెచ్చరిక
రిపోర్టర్: విజయ్
స్థలం: ఏలూరు
బ్యాంక్ అకౌంట్లను డబ్బు కోసం ఇతరులకు అమ్మి మ్యూల్ అకౌంట్లుగా మారుస్తే తీవ్రమైన సైబర్ నేరాలు మరియు మనీలాండరింగ్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలను ఏలూరు పోలీస్ శాఖ తీవ్రంగా హెచ్చరించింది. ఎవరైనా అకౌంట్లు కొనాలని సంప్రదిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అత్యవసర సహాయం కోసం ఎప్పుడైనా 112 నెంబర్కు కాల్ చేయాలని స్పష్టం చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.