ఐరాస వేదికగా పాకిస్థాన్ బంగ్లాదేశ్ ప్రధానిల కీలక భేటీ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: న్యూయార్క్

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ న్యూయార్క్లో సమావేశమయ్యారని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 24న జరిగిన ఈ భేటీలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించారు. విద్య, పర్యాటకం వంటి రంగాల్లోనూ పరస్పర సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు.