కాంగ్రెస్ అసమర్థత వల్లే తెలంగాణలో కరవు తాండవిస్తోందన్న హరీశ్‌రావు

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో ప్రస్తుతం కనిపిస్తున్న దుర్భిక్ష పరిస్థితులు ప్రకృతి వైపరీత్యం వల్ల ఏర్పడినవి కాదని, ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల వచ్చిన కరవు అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌లో తీవ్రంగా ధ్వజమెత్తారు. కృష్ణా జలాల వినియోగంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని, శ్రీశైలం నుంచి 84 టీఎంసీల నీటిని వాడుకున్నామనడం పచ్చి అబద్ధమని ఆయన ఆరోపించారు.