వాహనదారులకు కేంద్రం భారీ ఊరట: ఫ్లెక్స్ ఫ్యూయల్ నిబంధనల మార్పు
రిపోర్టర్: రాజేష్
స్థలం: న్యూఢిల్లీ
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా వంద శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో నడిచే వాహనాలను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల నిబంధనలలో కీలక మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కొత్త నిబంధనల ద్వారా E85 ఇంధనంతో పాటు E100 కు సమాన హోదా లభించిందని తెలిపారు. అయితే సాధారణ పెట్రోల్ లేదా E20 ఇంధనంతో నడిచే వాహనదారులు ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.