శ్రీవారి భక్తులకు శుభవార్త, మచిలీపట్నం-తిరుచానూరు ప్రత్యేక రైళ్లు

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మచిలీపట్నం-తిరుచానూరు మధ్య వారాంతపు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ ట్రైన్లు విజయవాడ, నెల్లూరు, రేణిగుంట మీదుగా నడవనున్నాయి. అలాగే గుంటూరు-చర్లపల్లి మధ్య మరో ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలు ప్రయాణికులకు ఎంతో ఊరటనివ్వనున్నాయి.