బాధ్యతారాహిత్యం: ఇద్దరు పీఐఓలకు జరిమానా విధించిన రాష్ట్ర సమాచార కమిషన్
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
ఆర్టీఐ విచారణకు గైర్హాజరైన ఇద్దరు ప్రజా సమాచార అధికారులకు రూ.25 వేల చొప్పున జరిమానా విధిస్తూ రాష్ట్ర సమాచార కమిషనర్ వంటేరు రవిబాబు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. గుంతకల్లు తహసీల్దారు కార్యాలయం, వైఎస్సార్ కడప జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించిన అప్పీళ్ల విచారణకు వారు హాజరుకాకపోవడాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఆర్టీఐ అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులను ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.