మహిళలకు తీపి కబురు: నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం తీపి కబురు అందించిందని, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని రానున్న నవంబర్ 19వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. కోటిమంది మహిళలకు కోటి చీరలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ బృహత్తర కార్యక్రమం కోసం దాదాపు రూ. 300 కోట్ల వరకు నిధులను కేటాయించి అన్ని రకాల ఏర్పాట్లను వేగవంతం చేశామని ప్రభుత్వం పేర్కొంది.