ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా నవరాత్రులు: పది రోజులు పది అలంకారాలు
రిపోర్టర్: శివ
స్థలం: విజయవాడ
అక్టోబర్ పదకొండు నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయని ఆలయ అధికారులు వెల్లడించారు. పది రోజుల పాటు అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ పదహారున మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవి అలంకారంలో జగన్మాత భక్తులను అనుగ్రహించనున్నారు. ఉత్సవాల ముగింపు రోజున కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం కన్నుల పండువగా నిర్వహించనున్నట్లు దేవస్థానం నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు.