మురసు తుఫాన్ ముప్పు: వాట్సప్ వేదికగా ఫిర్యాదు చేయాలని అధికారులు వెల్లడి

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

మురసు తుఫాన్ ప్రభావంతో తలెత్తే వివిధ సమస్యలను రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అధికారుల మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ వేదిక ద్వారా సంబంధిత అధికారులకు చేరవేయవచ్చని అధికారులు వెల్లడించారు. అత్యవసర సహాయం కోసం ప్రజలు టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు. తుఫాన్ ముప్పు నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.