యువతకు ఆదర్శం: విద్యా ఉద్యోగ రంగాల్లో నల్లబెల్లి యువత అద్భుత ప్రస్థానం

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

మహాత్మా గాంధీ ఆశయాల స్ఫూర్తితో నల్లబెల్లి మహాత్మా గాంధీ కాలనీ యువత విద్య, ఉద్యోగ రంగాల్లో ఆదర్శంగా నిలుస్తోంది. కాలనీలో ముప్పై మంది యువత పీజీ పూర్తి చేయగా, పదహారు మందికి పైగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించారు. విద్యతో పాటు ఉద్యోగాల్లో రాణిస్తున్న ఈ యువతను పలువురు అభినందించారు.