రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు స్వామిరెడ్డి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: హాజీపూర్

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులుగా స్వామి రెడ్డి నియమితులయ్యారు. బుధవారం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్వామి రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో రైతుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు.