ఓటు హక్ కు వినియోగించుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత

రిపోర్టర్: కృష్ణ స్థలం: అనకాపల్లి

ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు కోరకుండా సామాన్య పౌరురాలిగా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆమె క్యూలైన్ లో నిలబడి ఓటేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్ కు అత్యంత కీలకమని, పౌరులంతా విధిగా తమ బాధ్యతను నిర్వర్తించాలని ఈ సందర్భంగా మంత్రి అనిత పిలుపునిచ్చారు.