తాతా మధు అరెస్టు.. తిరుమలాయపాలెంలో టీఆర్ఎస్ కార్యకర్తల రాస్తారోకో
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: తిరుమలాయపాలెం
తిరుమలాయపాలెం బైపాస్ రోడ్డు వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తాతా మధు అరెస్టును నిరసిస్తూ లారీలు, బస్సులను నిలిపివేసి రాస్తారోకో నిర్వహించారు. తక్షణమే ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ నిరసనతో బైపాస్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆందోళనకారులను శాంతింపజేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.