తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: నేడు రూ.300 దర్శన టికెట్లు విడుదల

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తిరుమల

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన రూ.300 టికెట్లను ఈరోజు ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ నెల పన్నెండు, పదమూడు, పద్నాలుగు, పంతొమ్మిది, ఇరవై తేదీలకు సంబంధించిన కోటాను భక్తులు అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల పదకొండు నుంచి ఇరవై తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు వెల్లడించారు.