రా ఏజెన్సీ వ్యవస్థాపకుడు ఆర్.ఎన్.కావు జీవితంపై కరణ్ జోహార్ కొత్త సినిమా
రిపోర్టర్: వెంకట్
స్థలం: India
భారత విదేశీ గూఢచార సంస్థ రా వ్యవస్థాపక చీఫ్ రమేశ్వర్ నాథ్ కావు జీవితంపై ప్రముఖ చలనచిత్ర నిర్మాత కరణ్ జోహార్ కొత్త ప్రాజెక్ట్ను ప్రకటించారు. రా 58వ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఈ ప్రకటన వెలువడింది. నితిన్ గోఖలే రచించిన జెంటిల్మన్ స్పైమాస్టర్ పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా 1955 నుండి 1971 వరకు సాగే సంఘటనల నేపథ్యంలో రూపుదిద్దుకోనుంది. ధర్మ ప్రొడక్షన్స్ మరియు లియో మీడియా కలెక్టివ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2028 ఆగస్టు 11న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.