కృష్ణ బిలం వైపు దూసుకొచ్చిన నక్షత్రం ధ్వంసంపై కీలక అధ్యయనం

రిపోర్టర్: సురేష్ స్థలం: World

కృష్ణ బిలం సమీపానికి వచ్చిన నక్షత్రాన్ని దాని గురుత్వాకర్షణ శక్తి ఛిన్నాభిన్నం చేసే టైడల్ డిస్రప్షన్ ఈవెంట్ పై కర్టిన్ విశ్వవిద్యాలయానికి చెందిన అడెల్ గుడ్ విన్, ప్రిన్స్టన్ కు చెందిన ఆండ్రూ మమ్మరీ నేతృత్వంలో కొత్త అధ్యయనం వెలువడింది. నక్షత్రం ధ్వంసమైన తర్వాత కృష్ణ బిలాలు జెట్లను ఎప్పుడు విడుదల చేస్తాయనే అంశాన్ని ఈ పరిశోధన ద్వారా ఖరారు చేశారు.