కన్నడ చిత్ర పరిశ్రమలో రవీనా టండన్: శివరాజ్‌కుమార్ సరసన తొలిసారి నటన
రిపోర్టర్: గోపి
స్థలం: Bengaluru
బాలీవుడ్ ప్రముఖ నటి రవీనా టండన్ కన్నడ చిత్ర పరిశ్రమలోకి మరోసారి అడుగుపెట్టారు. ఎంజీ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏ ఫర్ ఆనంద్ చిత్రంలో ఆమె నటిస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. బెంగళూరులోని ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన లాంఛనప్రాయ ప్రారంభోత్సవంతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రవీనా టండన్ తొలిసారిగా ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.