జనాభా నియంత్రణ చట్టాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు: పునఃసమీక్షకు గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: కిరణ్
స్థలం: న్యూఢిల్లీ
దేశంలో జనాభా నియంత్రణ చట్టాలు తమ ప్రాముఖ్యతను కోల్పోయాయని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలో ఆరాధే ధర్మాసనం వెల్లడించింది. మొత్తం సంతానోత్పత్తి రేటు పడిపోవడంతో ఈ చట్టాలు అర్థరహితంగా మారాయని పేర్కొంటూ, ఇద్దరు పిల్లల నిబంధనపై రెండు దశాబ్దాల క్రితం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. ఈ మేరకు మహారాష్ట్రకు చెందిన మహిళా సర్పంచ్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ కీలక ఆదేశాలు జారీ అయ్యాయి.