ఆధారాల్లేకుండా బీఆర్ఎస్ నేతలపై ఆరోపిస్తే ఊరుకోం: కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాకేశ్ ఫైర్
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ నేతలపై అవాస్తవ ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేశ్ హెచ్చరించారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఖాజాగూడ భూ ఆక్రమణల వివాదంలో కేటీఆర్, సంతోష్ కుమార్లను లాగడం దుర్మార్గమన్నారు. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తూ దుష్ట రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.